వికీడేటా:యాత్రలు/స్టేట్‌మెంట్లు

This page is a translated version of the page Wikidata:Tours/Statements and the translation is 94% complete.
Outdated translations are marked like this.

స్టేట్‌మెంట్ల యాత్రకు స్వాగతం

 
Wikidata

తిరిగి స్వాగతం-మీరు మాతోనే ఉన్నందుకు నెనరులు! ఈ రెండో యాత్రలో వికీడేటాలో ఉన్నత స్థాయి ఎడిటింగు ఎలా చెయ్యాలో తెలుసుకుంటారు. అంశాలకు స్టేట్‌మెంట్లు ఎలా తయారు చెయ్యాలో కూడా నేర్చుకుంటారు.

నేపథ్యంలో ఉన్న పేజీ నిజం పేజీ యొక్క ప్రతిరూపం మాత్రమే-దీన్ని మీ ప్రయోగశాలగా భావించండి. మీరిక్కడ చేసే మార్పుచేర్పులు వికీడేటాలో కనబడవు. అంచేత ఇక్కడ మార్పులు చేసేందుకు భయపడకండి. ఇక మొదలుపెడదాం రండి!

స్టేట్‌మెంట్లు

అంశాల యాత్రలో అంశాలకు లేబుళ్ళను, వివరణలనూ ఎలా చేర్చాలో తెలుసుకున్నారు. దీంతో వికీడేటాలో జ్ఞానాన్ని గుర్తించడానికి, వేరుపరచేందుకు, ప్రదర్శించేందుకూ ఇవి ఉపయోగపడతాయి. లేబుళ్ళు, వివరణలూ ముఖ్యమైనవే ఐనప్పటికీ, అవి తొలి అడుగు మాత్రమే-అంశాలకు చేర్చదగ్గ డేటా ఇంకా ఎంతో ఉంది!

ఈ ఇతర డేటా అంతా-భావనలు, టాపిక్కులు, ఆబ్జెక్టులూ-వికీడేటాలో "స్టేట్‌మెంట్లు"గా నమోదవుతాయి.

స్టేట్‌మెంట్లను, లేబుళ్ళు వివరణల లాగానే అంశాలకు చేర్చుతాం. మన భూమి యొక్క అంశం పేజీని తీసికొని ఇది ఎలా చెయ్యాలో చూద్దాం.

స్టేట్‌మెంట్లు

అంశం పేజీలన్నిటికీ స్టేట్‌మెంట్లు విభాగం ఉంది. దీనిలో ఎన్ని వరుసలైనా ఉండొచ్చు. ఈ వరుసల్లో రకరకాల సంగతులుండొచ్చు—పదాలు, సంఖ్యలు, బొమ్మ ఫైళ్ళు కూడా. ఇది సంక్లిష్టంగా కనిపించొచ్చుగానీ, ఇది ఒక సూటి విషయం. ఇప్పుడు ఈ వరసల్లో ఒకదాన్ని దగ్గరగా చూద్దాం.

లక్షణాలు, విలువలూ

ఈ వరుస భూమికి సంబంధించిన ఒక స్టేట్‌మెంటు. ఈ స్టేట్‌మెంటు, ఎడమవైపున ఉన్న ఒక డేటా వర్గంతో కూడుకొని ఉంది. దానికి సరిపోయే ఎంట్రీ కుడివైపున ఉంది. వికీడేటాలో ఈ డేటా వర్గాన్ని లక్షణం అంటాం. ఆ లక్షణాన్ని వివరించే కుడివైపున ఉన్న డేటాను విలువ అంటాం.

ఈ స్టేట్‌మెంటులో, భూమి యొక్క లక్షణం “ఎత్తైన ప్రదేశం”. దాని విలువ “ఎవరెస్ట్ శిఖరం.”

లక్షణాలు, విలువలూ

ఇప్పుడు ఈ కొత్త పరిజ్ఞానాన్ని వాడదాం.

కింది వాటిలో, ఓ గ్రహం యొక్క లక్షణం-విలువ జతకు ఏది చక్కని ఉదాహరణ?

కక్ష్య రకం - ఫలానా వారి పేరు పెట్టారు
కనుక్కున్న తేదీ - 1846 సెప్టెంబరు 23
సౌర వ్యవస్థ - ఎవరెస్ట్ శిఖరం

సరైన సమాధానం తెలుసుకునేందుకు బాణాన్ని నొక్కండి.

లక్షణాలు, విలువలూ

కక్ష్య రకం - ఫలానా వారి పేరు పెట్టారు
కనుక్కున్న తేదీ - 1846 సెప్టెంబరు 23
సౌర వ్యవస్థ - ఎవరెస్ట్ శిఖరం

1846 సెప్టెంబరు 23 నెప్ట్యూన్ యొక్క time of discovery or invention (P575). ఇది లక్షణం, విలువ - రెండింటి యొక్క ఒకే ఒక్క ఉదాహరణ.

లక్షణాల గురించి మరింతగా

లక్షణాలకు సంబంధించి, గుర్తుంచుకోవాల్సిన సంగతులు:

  • లక్షణాలకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఉదా: రంగు, పౌరసత్వ దేశం, సోదరి
  • లక్షణాల పరిమితి, ఎలాంటి డేటా విలువను చేర్చవచ్చో నియంత్రించడం. ఉదాహరణకు, "కనుక్కున్న తేది" అనేది లక్షణం తేదిని కాకుండా మరిదేన్నీ, "ఎరుప"నో, "పాకిస్తాన్" అనో ఇస్తే, విలువగా తీసుకోదు. ఈ నిబంధనలు వికీడేటాను దుశ్చర్యల నుండి కాపాడుతాయి.

తెలిసిందాండీ? ఇప్పుడు భూమికి మన మొదటి స్టేట్‌మెంటును చేరుద్దాం రండి.

స్టేట్‌మెంటును సృష్టించడం

భూమి సౌర వ్యవస్థలో భాగమని తెలియజెప్పే ఒక స్టేట్‌మెంటును చేరుద్దాం.

మనకో కొత్త వరుస కావాలి. స్టేట్‌మెంటు విభాగం కింద ఉన్న [చేర్చు] ను నొక్కండి. (అలా చెయ్యడంతో మీరు తరువాతి అంగకు వెళ్తారు)

స్టేట్‌మెంటును సృష్టించడం

ఇప్పుడు ఇందులో భాగం అనే లక్షణాన్ని చేరుద్దాం. మీరు టైపించడం మొదలు పెట్టగానే వికీడేటా డ్రాప్‌ డౌను జాబితా ద్వారా సూచనలిస్తుంది. మీకు కావలసినది ఆ జాబితాలో ఉంటే దాన్ని ఎంచుకుని, బాణాన్ని నొక్కి ముందుకు సాగండి.

స్టేట్‌మెంటును సృష్టించడం

మీ లక్షణానికి పక్కనే ఉన్న ఖాళీ ఫీల్డులో, సౌర వ్యవస్థ అని టైపించడం మొదలు పెట్టండి. వికీపీడియాలోని సంబంధిత విలువలన్నీ డ్రాప్‌డౌను జాబితాలో కనిపిస్తాయి. మీకు సరిపోయినదాన్ని ఎంచుకోండి (సూచన:అది Solar System అనే బీచ్ బాయ్స్ వాళ్ళ పాట కాదు!)."publish" ను నొక్కండి.. మీ స్టేట్‌మెంటు పేజీలో కనిపిస్తుంది.

అభినందనలు!

అభినందనలు! మీరు వికీడేటాలో స్టేట్‌మెంట్లు యాత్రను పూర్తిచేసారు.

ఎడిటింగును కొనసాగిస్తారా? ఇక ప్రయోగశాలను దాటి అసలు సైట్లోకి వెళ్ళేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లైతే, కింది లింకులు చూడండి:

ఇంకా నేర్చుకుంటారా? యాత్రల కేంద్రానికి వెళ్ళేందుకు ఇక్కడ నొక్కండి.

ఇంకా సందేహాలున్నాయా? IRC #wikidataconnect లో ఎవరితోనైనా చాట్ చెయ్యండి. లేదా కింది సహాయం పేజీలను చూడండి: