సహాయం:స్టేట్‌మెంట్లు

This page is a translated version of the page Help:Statements and the translation is 100% complete.

వికీడేటాలో, ఓ భావననో, ఓ టాపిక్కునో, ఓ సబ్జెక్టునో చూపించడానికి అంశాన్ని వాడతారు. ప్రతీ అంశానికీ ఒక పేజీ ఉంటుంది. "స్టేట్‌మెంట్" (Resource Description Framework (Q54872) graph format: Subject-Predicate-Object) అంటే, అంశం గురించి మనకు తెలిసిన సమాచారాన్ని - అంశానికి సంబంధించిన డేటాను - రికార్డు చేసే పద్ధతి. ఒక లక్షణాన్ని, కనీసం ఒక విలువతో కలిపితే అది ఒక స్టేట్‌మెంటు. స్టేట్‌మెంట్లలో మరిన్ని విలువలనూ, అవసరమైన చోట్ల క్వాలిఫయరలనూ, మూలాలనూ, ర్యాంకులనూ ఇచ్చి వాటిని మరింత విపులీకరించవచ్చు. స్టేట్‌మెంట్లతో వివిధ అంశాలను ఒకదానితో ఒకటి కలపవచ్చు. తద్వారా లింక్‌డ్ డేటా స్ట్రక్చరు ఏర్పడుతుంది.

భాష అంశం లక్షణం విలువ
ఇంగ్లీష్ Marie Curie occupation physicist
జర్మన్ Marie Curie Tätigkeit Physiker
ఫ్రెంచ్ Marie Curie occupation physicien ou physicienne
పోలిష్ Maria Skłodowska-Curie zajęcie fizyk
  Q7186 P106 Q169470

ఉదాహరణ:

వికీడేటాలో మేరీ క్యూరీ వృత్తికి సంబంధించిన సమాచారాన్ని చేర్చేందుకు, మేరీ క్యూరీకి చెందిన అంశంలో Marie Curie (Q7186) అనే స్టేట్‌మెంతును చేర్చాలి. occupation (P106) అనే లక్షణాన్ని వాడి, అందులో physicist (Q169470) అనే విలువను ఇవ్వవచ్చు. దానిలో chemist (Q593644) అనే విలుబ్వను కూడా చేర్చవచ్చు. వికీడేటాలో కెమిస్టు, ఫిసిసిస్టు అనే రెండు వేరువేరు పేజీలు ఉన్నాయని గమనించండి. మేరీ క్యూరీ ఈ రెండు పేజీలకూ లింకై ఉంటుంది.

భాషతో పట్టింపు లేని సాధారణ సూత్రాలు

 
వికీడేటా స్టేట్‌మెంటు అవలోకనం
(డగ్లస్ ఆడమ్స్ (Q42) ది)
 
ఒక లక్షణం-విలువ జతతో కూడిన స్టేట్‌మెంటుకు ఉదాహరణ
 
ఒకే లక్షణానికి అనేక విలువలు ఉన్న స్టేట్‌మెంటుకు ఉదాహరణ
 
ఒక లక్షణం-విలువ జత, క్వాలిఫయర్లు, ఒక మూలం లతో కూడిన బలమైన వికీడేటా స్టేట్‌మెంటుకు ఉదాహరణ

స్టేట్‌మెంటులో లక్షణం-విలువ జత ఉంటుంది. ఉదాహరణకు, "స్థానం: జర్మనీ."

ఓ స్టేట్‌మెంతు లోని లక్షణం ఓ డేటా విలువను చూపిస్తుంది. దాన్ని ఓ డేటా వర్గంగా - "రంగు", "జనాభా", "కామన్స్ మీడియా" వంటివి - భావించవచ్చు. ఈ స్టేట్‌మెంటు లోని "విలువ" అనేది అంశాన్ని వివరించే డేటా వస్తువు.

స్టేట్‌మెంట్లలో ఐచ్ఛిక విలువలను (క్వాలిఫయర్లు, మూలాలు, ర్యాంకు) జోడించి, వాటిని విస్తరించవచ్చు, విశదీకరించవచ్చు, వాటికి మరింత సందర్భాన్ని జోడించవచ్చు. స్టేట్‌మెంటులో మూలాలు, ర్యాంకులూ లేని మూలభాగాన్ని క్లెయిమ్ అని అంటారు. క్వాలిఫయర్లు లేని మూలభాగాన్ని స్నాక్ (snak) అని కూడా అంటారు

కాబట్టి, మూలాలు (ఉల్లేఖనలు), ర్యాంకులతో పాటు, క్వాలిఫయర్ల ద్వారా కేవలం ఒక మామూలు లక్షణ-విలువ జతలో వ్యక్తీకరించగలిగే దానికంటే మించి స్టేట్‌మెంట్లను విస్తరించడానికి, వ్యాఖ్యానించడానికి లేదా వాటికి మరింత సందర్భాన్ని జోడించడానికీ వీలు కలుగుతుంది.

స్టేట్‌మెంటు నిర్మాణంలో లక్షణం-విలువ(లు), ప్రత్రీ ఒక్క విలువకూ ఐచ్ఛికాలు (ర్యాంకు, క్వాలిఫయరు, మూలాలు) ఉంటాయి.

లక్షణాలు

వికీడేటా లోని ప్రతీ లక్షణానికీ ముందే నిర్వచించిన ఒక డేటా రకం ఆపాదించబడి ఉంటుంది. ఆ లక్షణానికి ఇచ్చే విలువ ఈ డేటా రకమే ఇచ్చేలా నిర్బంధం ఉంటుంది. ఉదాహరణకు, "రంగు" అనే లక్షణం ఇతర అంశాలను మాత్రమే విలువగా తీసుకుంటుంది, "జనాభా" అనే లక్షణం, సంఖ్యలను మాత్రమే తీసుకుంటుంది, "కామన్స్ మీడియా" అనే లక్షణానికి వికీమీడియా కామన్స్‌లో ఉన్న మల్టీమీడీయా ఫైళ్ళను మాత్రమే ఇవ్వగలం.

లక్షణాలను ఎలా వాడాలి అనే విషయమై మరింత సమాచారం కోసం Wikidata:Properties చూడండి.

విలువలు

బహుళ విలువలు

ఏదైన అంశానికి దాని సహజ ప్రకృతి రీత్యా పలు విలువలు తీసుకునేది అయితే (వ్యక్తి సంతానం, దేశపు అధికారిక భాషలు వంటివి), ఈ విలువలన్నిటినీ చేర్చడంలో పూర్తిగా ఆమోదయోగ్యమే.

మరో వైపు, ఒకే విలువ ఉండవలసిన ఏదైనా అంశానికి (దేశ జనాభా వంటిది) బహుళ విలువలు ఉంటే (ఉదాహరణకు, వివిధ వర్గాలు ఇచ్చిన వేరువేరు విలువలు), ఈ విలువలన్నిటినీ చేర్చవచ్చు. కానీ వీటికి అదనంగా క్వాలిఫయర్లను వాడాలి. స్టేట్‌మెంటులోని లక్షణానికి ఇచ్చిన విలువను వివరించేందుకో, మరింత మెరుగుపరచేందుకో క్వాలిఫయరును వాడతారు. మరింత సమాచారం కోసం Help:Qualifiers చూడండి.

విలువ తెలియనివి లేదా అసలు విలువ లేనివి

కొన్ని అంశాలలో, ఏదైనా లక్షణానికి అసలు విలువ ఉండకపోవచ్చు (ఆ లక్షణం ఉండదన్నమాట), లేదా విలువ తెలిసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ, ఈ డేటా విలువలు ఆ అంశానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వవచ్చు. అలాంటి సందర్భంలో దాన్ని వికీడేటాలో ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు, Elizabeth I of England (Q7207) కు చెందిన child (P40) లక్షణానికి "విలువ లేదు" అని రాయాలి. ఆమెకు పిల్లలు లేరు అనేదొ పాజిటివ్ స్టేట్‌మెంటే. William Shakespeare (Q692) కి చెందిన date of birth (P569) విలువ "విలువ తెలియదు" అని రాయాలి. సంబంధిత సమాచారం అందుబాటులో లేదు అనేది కూడా పాజిటివ్ స్టేట్‌మెంటే.

విలువ తెలియదు అంటే, అది తెలిసిన వస్తువే అయి ఉండవచ్చు గానీ, దానికి వికీడేటాలో ఇంకా అంశం లేదు అని అర్థం కావచ్చు. అయితే, ఈ సందర్భంలో ఆ వస్తువుకు ఒక అంశాన్ని సృష్టించడమనేది అత్యుత్తమ పద్ధతి - అది విషయ ప్రాముఖ్యత కు అనుగుణంగా ఉంటే.

వికీడేటా లోని విలువల్లో అత్యధికమైన వాటికి కస్టం వొలువలుంటాయి. వాటిని మామూలు పద్ధతి లోనే చేరుస్తారు. తెలియని విలువలను, విలువలు లేని వాటినీ, విలువ ఫీల్డుకు పక్కనే,   లాగా ఉండే ఐకన్ను నొక్కి చేర్చవచ్చు. అలాగే, తెలియని విలువను లేదా విలువ లేదు అనే వాటిని ఏదైనా కస్టమ్‌ విలువకు మార్చడానికి కూడా ఈ ఐకన్ను వాడవచ్చు.

అంశం విలువలు

వికీడేటాలో అత్యంత సాధారణమైన విలువ అంశం. అంటే, ఆ లక్షణం వికీడేటా లోనే ఉన్న మరొక అంశాన్ని విలువగా తీసుకుంటుంది. ఉదాహరణకు, Albert Einstein (Q937) instance of (P31) human (Q5) అనే ఒక స్టేట్‌మెంటు ఉందనుకుందాం. దానర్థం, Albert Einstein (Q937) అనే అంశపు instance of (P31) అనే లక్షణానికి విలువ human (Q5) అనే అంశం అన్నమాట. లక్షణపు ఈ విలువ ఇంకా ఉనికిలో లేనట్లైతే (Albert Einstein (Q937) అనేది ఏదో గ్రహాంతర వాసి అనుకోండి), దానికి ఒక అంశాన్ని సృష్టించవచ్చు.

సంఖ్యాత్మక విలువలు

సంఖ్యా విలువలు ఇచ్చేటపుడు కింది నిర్బంధలను గమనంలో ఉంచుకోవాలి. వికీడేటాలో ఇవ్వగల అతిపెద్ద పాజిటివ్ సంఖ్య 9e124, అతిపెద్ద నెగటివ్ సంఖ్య -9e124. ఫ్లోట్‌స్ విషయంలో, అదనంగా ఒక డెసిమల్ స్థానాన్ని ఇవ్వవచ్చు, 9,9e124 లాగా. కానీ 9,91e124 అనేది సాధ్యం కాదు. అతి చిన్న పాజిటివ్, అతిచిన్న నెగటివ్ సంఖ్యలు 1e-124, -1e-124. ఫ్లోట్‌ల విషయంలో, ఘాతాంకం (ఎక్స్పొనెంటు) 123 మాత్రమే ఉండవచ్చు. దాంతో అతి చిన్న ఓఅజిటివ్, అతిచిన్న నెగటివ్ ఫ్లోట్‌లు 1.0e-123, -1.0e-123 (విలువ లోని ప్రెసిషన్ను చూపించేందుకు సున్నా అనేదాన్ని ఉంచేస్తుందని గమనించండి. దీనికీ, 1e-123 కూ ఉన్న తేడాను గమనించండి).

నిర్థారించుకోదగ్గ సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలి

వికీడేటా లోకం లోని "వాస్తవాలను" నమోదు చేసే డేటాబేసు కాదు, ఆ జ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలకు లింకు లిచ్చే ద్వితీయ స్థాయి జ్ఞానఖని మాత్రమే. దానర్థం, వికీడేటా వాస్తవంగా జర్మనీ జనాభా ఎంత అనేది ఇవ్వదు; ఏదైనా నిర్దుష్టమైన మూలం జర్మనీ జనాభా ఎంత అని చెబుతోందో - The World Factbook (Q11191) లాంటివి, అ సమాచారాన్ని మాత్రమే చూపిస్తుంది.

అంచేత, చాలా స్టేట్‌మెంట్లలో నిర్థారించుకోదగ్గ సమాచార మూలాన్ని - పుస్తకం, శాస్త్ర సమాచారం, వార్తాపత్రికలు - ఇవ్వాలి. వికీడేటాలో, స్టేట్‌మెంట్లలో ఇచ్చిన సమాచారాన్ని "మూలాలు" ద్వారా సంబంధించిన సమాచార వనరులను ఉదహరించవచ్చు. మరింత సమాచారం కోసం Help:Sources చూడండి.

బహుళత్వం, ఏకాభిప్రాయం

స్టేట్‌మెంట్లలో వివిధ మూలాలు ఇచ్చే సమాచారం ఉంటుంది. వివిధ మూలాలు ఇచ్చే సమాచారం పరస్పర విరుద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వికీడేటాలో వివిధ దృక్కోణాలను చూపించే అవకాశం ఉంది.

వివాదాలు ఏర్పడినట్లైతే, సముదాయపు ఏకాభిప్రాయం (కన్సెన్సస్) ద్వారా లక్షణపు విలువను నిశ్చయిస్తారు. అయితే, ఇతర దృక్కోణాలను కూడా అదనపు విలువల ద్వారా చేర్చవచ్చు - వాటికి మూలమూ, సముచితమైన క్వాఇఫయర్లూ ఉంటేనే. ర్యాంకులను కూడా వాడవచ్చు; ఏకాభిప్రాయం ఉన్న విలువను అంగీకరించిన ర్యాంకు (ప్రిపర్‌డ్ ర్యాంకు) గా చూపించవచ్చు. మరింత సమాచారం కోసం Help:Ranking చూడండి.

వివాదాలను ఆ అంశపు చర్చ పేజీలో చర్చించాలని గమనించండి. విలువలపై Edit warring అనేది ఆమోదనీయం కాదు.

అయోమయ నివృత్తి, తదితర అంశం-కాని వికీమీడియా పేజీలు

ఏదైనా వికీడేటా అంశం, వికీమీడియా ప్రాజెక్టు లోని ఏదైనా పేజీని - ఆ పేజీ లోని సబ్జెక్టును కాకుండా - ఉదహరిస్తోంటే, ఆ పేజీ రకాన్ని గుర్తించే instance of (P31) లక్షణాన్ని వాడాలి. వీటిలో వర్గం, మూస, ప్రధాన పేరుబరికి బయట ఉండే ఇతర పేజీలూ ఉంటాయి.

అయోమయ నివృత్తి పేజీలన్నింటిలో 'instance of (P31), Wikimedia disambiguation page (Q4167410)' స్టేట్‌మెంట్లు ఉండాలి.

ఉదాహరణలు:

అంశంః Madonna (Q1564372)
దీనికి ఉదాహరణ: Wikimedia disambiguation page (Q4167410)
అంశం: list of lighthouses in Iceland (Q3253135)
దీనికి ఉదాహరణ: Wikimedia list article (Q13406463)

వికీపీడియా లోని పేజీ ఒకటి కంటే ఎక్కువ భావననో, వస్తువునో వివరిస్తూ ఉంటే, అవన్నీ కలిపి (వాటి సమ్మేళనం) ఒక సబ్జెక్టుకు చెందినవైతే, ఒక్కో భావనకు, ఒక్కో వస్తువుకూ వేరువేరు వికీడేటా పేజీలకు లింకు ఇచ్చేందుకు 'has part(s) (P527)' వాడాలి. ఆ సమ్మేళనం ఒకదానితో ఒకటి సంబంధం లేనివై, కానీ వివిధ భావనల, వస్తువుల సమూహమైనట్లైతే, ఆయా వేరువేరు భాగాలకు 'instance of (P31), Wikipedia article covering multiple topics (Q21484471)', 'main subject (P921)' లను వాడాలి; ఈ సందర్భంలో has part(s) (P527) వాడకూడదు. మరింత సమాచారం కోసం Help:Modelling/Wikipedia and Wikimedia concepts § Compound Wikipedia articles చూదండి.

మినహాయింపు విధానం

వికీడేటా స్టేట్‌మెంట్లకు మూలాలు ఉండాలి. వాటి వనరులు విశ్వసనీయమైనవీ, తటస్థమైనవీ అయి ఉండాలి.

ఈ క్రింది రకాల సమాచారాన్ని వికీడేటా స్టేట్‌మెంట్లలో ఇవ్వకూడదు.

  • జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన సున్నితమైన, గోపనీయమైన సమాచారాన్ని చూపించే స్టేట్‌మెంట్లు. మరింత సమాచారం కోసం Wikidata:Living people చూడండి

లక్షణాల వరుస

లక్షణాలు, క్వాలిఫయర్లను చూపించిన వరుసకు ప్రాముఖ్యత ఏమీ లేదు; ఆయా స్టేట్‌మెంట్లు చేర్చిన తేదీలను బట్టి వాటిని చూపిస్తామంతే.

ప్రస్తుత వికీడేటా ఆకృతి (కాన్ఫిగరేషను) ఇలా ఉంది:

  • అంశాల పేజీల్లో: బయటి ఐడెంటిఫయర్లను చూపించే లక్షణాలు పేజీలో అడుగున, మిగతావన్నీ వాటికి పైన ఉంటాయి.
  • లక్షణాల పేజీల్లో: లక్షణాల నిర్బంధాల లక్షణాలు పేజీలో అడుగున, మిగతావన్నీ పైన ఉంటాయి.

అలాగే, MediaWiki:Wikibase-SortedProperties లో లక్షణాల జాబితా ఉంటే, ఆ పేజీలో అవి ఏ వరుసలో ఉన్నాయో అదే వరుసలో పేర్చి చూపిస్తుంది. జాబితాలో లేని లక్షణాలను తేదీ గ్వారీగా పేర్చి చూపిస్తుంది.

లక్షణంలో స్టేట్‌మెంట్ల వరుస

ఒకే లక్షణానికి అనేక స్టేట్‌మెంట్లు ఉంటే, వాటిని చేర్చిన వరసను బట్టి వాటిని పేర్చుతుంది. నమూనా: Q60#P1082 కు వివిధ సంవత్సరాలకు విలువలున్నాయి.

వికీడేటా క్వెరీ సర్వరులో క్వేరీ చేసినపుడు, అవి ఇదే వరుసలో రావచ్చు లేదా మరేదైనా వరుసలోనైనా రావచ్చు. ఫలానా వరుసలో రావాలంటే, ఇతర విశేషాలను వాడాల్సి ఉంటుంది:

  • స్టేట్‌మెంటు ర్యాంకు
  • స్టేట్‌మెంటు లోని ఒక క్వాలిఫయరు, series ordinal (P1545), ranking (P1352), ranking (P1352) లాగా
  • విలువ
  • లేదా అంశాలే విలువలైతే, విలువగా వాడిన అంశం లోని ఓ స్టేట్‌మెంటు

బాగా ముఖ్యమైన అంశాళ విషయంలో, స్టేట్‌మెంట్లను చూపించే వరుసను మార్చాలని అనిపించవచ్చు. ఈ పని rearrange values.js (Q106683950) తో చెయ్యవచ్చు, కానీ ఇతర విశేషాలు కూడా ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత. వరుసలో అమర్చడం కోసం గాను, ఉన్న స్టేట్‌మెంట్లను తొలగించి మళ్ళీ సృష్టించడం చెయ్యవద్దు.

తేదీ గానీ, సీరియల్ ఆర్డినల్ క్వాలిఫయర్లు గానీ ఉండే కొన్ని బహుళ-విలువల లక్షణాల విషయంలో, స్టేట్‌మెంట్లను చేర్చాక వాటిని ఆటోమాటిగ్గా పేర్చే పద్ధతిని ఏర్పాటు చెయ్యాలని వికీడేటా సముదాయం సూచించింది. నమూనా: జనాభా వివరాలను సంవత్సరం వారీగా పేర్చడం (స్థలాలకు సంబంధించిన అనేఖ అంశాలకు అలాంటి సంఖ్యలు ఉన్నాయి. వాటిని మానవికం గానో మరోలానో పేర్చడం దండగ)

స్టేట్‌మెంట్లను చేర్చడం

అంశం పేజీకి - ఈ సందర్భంలో Marcel Bouix (Q16775650) కు - స్టేట్‌మెంట్లను కింది పద్ధతిలో చేర్చాలి

 
కింది, స్టేట్మెంట్స్ విభాగానికి స్క్రోల్ చేయండి
 
స్టేట్‌మెంట్లన్నిటి కంటే దిగువన ఉన్న "add" ను నొక్కండి
 
అప్పుడూ కనిపించే కొత్త లక్షణం ఫీల్డులో టైపించడం మొదలుపెట్టండి
 
అపుడు వచ్చిన ఎంటిటీ సూచనల్లోంచి ఒక లక్షణాన్ని ఎంచుకోండి
 
అపుడు లక్షణానికి కుడివైపున కనిపించే ఫీల్డులో విలువను టైపించడం మొదలుపెట్టండి. అయ్యాక, "save" నొక్కండి
 
అంతా అయ్యాక స్టేట్‌మెంటు ఇలా కనిపిస్తుంది. దాన్ని మార్చడానికి, తొలగించడానికీ "edit" నొక్కండి

క్వాలిఫయర్లు, మూలాలు, ర్యాంకులూ చేర్చడానికి, పేజీకి అడుగున ఉన్న సంబంధిత సహాయ డాక్యుమెంటేషను చూడండి

ఇవి కూడా చూడండి

సంబంధిత సహాయం పేజీల కోసం, ఇవి చూడండి:

  • Help:Properties, లక్షణాలు ఏంటి, అవి ఏ నియమాలను పాటిస్తాయి వంటి సమాచారం కోసం
  • Help:Sources, మూలాలు ఏంటి, అవి ఏ నియమాలను పాటిస్తాయి వంటి సమాచారం కోసం
  • Help:Qualifiers, క్వాలిఫయర్లు ఏంటి, అవి ఏ నియమాలను పాటిస్తాయి వంటి సమాచారం కోసం
  • Help:Ranking, ర్యాంకులు ఏంటి, అవి ఏ నియమాలను పాటిస్తాయి వంటి సమాచారం కోసం
  • Help:QuickStatements, QuickStatements వాడి, బ్యాచ్చీలుగా స్టేట్‌మెంట్లను చేర్చడం ఎలాగో తెలుసుకునేందుకు

అదనపు సమాచారం, మార్గదర్శకాల కోసం, చూడండి:

  • Project chat, for discussing all and any aspects of Wikidata
  • Wikidata:Glossary, the glossary of terms used in this and other Help pages
  • Help:FAQ, frequently asked questions asked and answered by the Wikidata community
  • Help:Contents, the Help portal featuring all the documentation available for Wikidata